దేవేందర్ గౌడ్ ని పరామర్శించిన చంద్రబాబు || CM Chandrababu Naidu meets Devender Goud ||అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ ను పరామర్శించారు. రాచెస్టర్ లోని మేయా క్లినిక్ లో దేవేందర్ గౌడ్ క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు.
కప్పుడు ఆయన టీడీపీలో ముఖ్య నేత. చంద్రబాబు తరువాత నెంబర్ 2 ఆయనే అనే వారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఎక్కడున్నారో? ఏమయ్యారో చాలా మందికి తెలియదు. అతనే టీడీపీ సినియర్ నేత దేవేందర్ గౌడ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంమంత్రిగా కూడా పనిచేశారు. ఆ వ్యక్తి తరువాత నవ తెలంగాణ పేరు పార్టీ పెట్టడం, దానిని మూసేసి చిరంజీవి పెట్టి ప్రజారాజ్యం వెళ్లడం జరిగాయి. అక్కడ కూడా ఇమడలేక మళ్లీ సొంత గూటికే వచ్చేశారు. టీడీపీలోకి తిరిగి వచ్చాక కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాల్లో కనిపించారు. అనంతరం ఆయన చాలా అరుదుగా కనిపించడం మొదలుపెట్టారు. ఇక కొన్ని నెలల నుంచి ఆయన గురించి ఏ వార్త లేదు. ఎక్కుడున్నారో? ఎలా ఉన్నారో తెలియలేదు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న చంద్రబాబు దేవేందర్ గౌడ్ ను కలవడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. చంద్రబాబుతో కూర్చున్నది ఎవరో పోల్చుకోవడానికి టీడీపీ వారికే కాస్త సమయం పట్టింది. అంతగా ఆయన మారిపోయారు. నల్లగా, ముఖం ఉబ్బినట్టు అయ్యింది. ఆయన అలా అవ్వడానికి కారణం క్యాన్సర్. కొన్ని నెలలుగా ఆయన క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అమెరికాలోని రాచెస్టర్‌లోని మేయో క్లినిక్‌లో ఆయనకు చికిత్స సాగుతోంది. అందుకే ఆయనను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లారు.
Visakha view Is a South Indian Channel, Here You Can Find Latest News about Viasakhapatnam, You Can Also Find About Political Leaders,Inspirational Videos in This Channel.. You Can Also Follow Our Posts By Visiting Our Site www.visakhaview.com
Visakhapatnam is a port city and industrial center in the Indian state of Andhra Pradesh, on the Bay of Bengal. It’s known for its many beaches, including Ramakrishna Beach, home to a preserved submarine at the Kursura Submarine Museum. Nearby are the elaborate Kali Temple and the Visakha Museum, an old Dutch bungalow housing local maritime and historical exhibits.

Follow Us :

website : www.visakhaview.com
G+ :
FB :
Twitter :

Share:

Written by

The author didnt add any Information to his profile yet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *